31 August, 2026 | 12:04 PM

నేపాల్–టిబెట్ వరదల్లో పెరుగుతున్న మృతుల సంఖ్య

31-08-2026 10:57 AM

కాఠ్మాండు: నేపాల్- టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన భీకర వరదలు, కొండచరియలు విరిగిపడటంతో పరిస్థితి మరింత విషమంగా మారింది. ీ విపత్తుల్లో మృతుల సంఖ్య 790కి చేరువైంది. వేలాది మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో జలవిద్యుత్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న కార్మికులు, విదేశీయులు కూడా ఉన్నారు. 

టన్నెల్స్‌లో చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ

వరదల ధాటికి భారీగా మట్టి, రాళ్లు పేరుకుపోవడంతో జలవిద్యుత్ ప్రాజెక్టుల టన్నెల్స్‌లో వందలాది మంది చిక్కుకున్నట్లు అధికారులు గుర్తించారు. వారిని బయటకు తీసేందుకు నేపాల్ భద్రతా బలగాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. టన్నెల్ ప్రవేశ మార్గాలను క్లియర్ చేసి, ఆక్సిజన్ సిలిండర్లతో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 

భారత్‌ నుంచి ప్రత్యేక సహాయం

సంక్లిష్టమైన టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ల కోసం నేపాల్‌కు భారత్ ప్రత్యేక సాంకేతిక సహాయాన్ని అందిస్తోంది. భారత, చైనా నిపుణులు నేపాల్ రెస్క్యూ బృందాలతో కలిసి చిక్కుకున్న వారిని గుర్తించి సురక్షితంగా బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు.  

వరదల కారణంగా రహదారులు, వంతెనలు, జలవిద్యుత్ ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతినడంతో సహాయక చర్యలకు సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రతికూల వాతావరణం, కొండ ప్రాంతాల్లో పేరుకుపోయిన భారీ శిథిలాలు రెస్క్యూ ఆపరేషన్లను మరింత క్లిష్టతరం చేస్తున్నాయి