31 August, 2026 | 11:30 AM

రిటైర్మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలి: టీఎస్‌జీఆర్‌ఈఏ జిల్లా అధ్యక్షులు

31-08-2026 10:15 AM

ఖమ్మం టౌన్ ( విజయ క్రాంతి): రిటైర్మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలని టి ఎస్ జి ఆర్ ఈ ఏ జిల్లా అధ్యక్షులు  మేదరమట్ల సుబ్బయ్య, ఖమ్మం జిల్లా నాయకులు దొడ్డా కృష్ణారావు, కమిశెట్టి నాగేందర్‌రావు డిమాండ్ చేశారు. ఆదివారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ మార్చి 2024 నుండి రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన అన్ని రకాల రిటైర్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు.

జూలై 2023 నుండి అమలులోకి రావలసిన 2వ పి.ఆర్.సి గడువు ఈ సెప్టెంబర్‌తో ముగుస్తున్నందున, ప్రభుత్వం ఆలస్యం చేయకుండా వెంటనే పి.ఆర్.సి నివేదికను మంజూరు చేసి ఉద్యోగులు, పింఛనుదారులకు తీపి కబురు అందించాలని కోరారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 6 డి.ఏ  లను వెంటనే మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.