31 August, 2026 | 1:31 PM

పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి శ్రీధర్‌బాబు

31-08-2026 10:24 AM

కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి

మనోధైర్యం కల్పించిన రాష్ట్ర మంత్రి

మంథని/కరీంనగర్, ఆగస్టు 30 (విజయ క్రాంతి): ఇటీవల మృతి చెందిన పలువురు వ్యక్తుల కుటుంబ సభ్యులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల చిత్రపటాలకు నివాళులర్పించి, ఆయా కుటుంబ సభ్యులకు మనోధైర్యం  కల్పించారు. మంథని మున్సిపల్ పరిధిలో ఇటీవల మృతి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఆర్‌కే రాజు యాదవ్ కుటుంబ సభ్యులను మంత్రి శ్రీధర్‌బాబు పరామర్శించారు. అలాగే మంథని మున్సిపల్ పరిధిలో మృతి చెందిన గంట రవి కుమారుడి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

మంథని మండలం ఎగ్లాస్‌పూర్ గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన బొడ్డు చంద్రయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంథని 8వ కాలనీలో ఇటీవల మృతి చెందిన బత్తిని శ్రీనివాస్ తల్లి కుటుంబ సభ్యులను కలిసి వారికి ధైర్యం చెప్పారు. 

కరీంనగర్ జిల్లాలోనూ పరామర్శలు

కరీంనగర్‌లోని రాంపల్లి ప్రాంతంలో ఇటీవల మృతి చెందిన రాంపల్లి రాధమ్మ కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. అలాగే కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్యంపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాగోని లక్ష్మీనారాయణ గౌడ్ కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

అదేవిధంగా కోయడ మండలం శనివారం గ్రామంలో ఇటీవల మృతి చెందిన కరీంనగర్ అర్బన్ బ్యాంక్ అధ్యక్షుడు కర్ర రాజశేఖర్ తల్లి కుటుంబ సభ్యులను మంత్రి శ్రీధర్‌బాబు పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు నివాళులర్పించిన మంత్రి శ్రీధర్‌బాబు, ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు.