ఇంగ్లాండ్‌కు కాంస్య పతకం
- ఫ్రాన్స్‌పై 6 గోల్స్‌తో విజయం
- ఎంబాపె పోరాటం వృథా
మియామీ, జూలై 19: సాకర్ ప్రపంచకప్‌లో మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్ అభిమానులకు ఫుల్ కిక్కిచ్చింది. ఇంగ్లాండ్, ఫ్రాన్స్ హోరాహోరీగా తలపడిన వేళ గోల్స్ వర్షం కురిసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ఇంగ్లాండ్ 6 తేడాతో ఫ్రాన్స్ పై గెలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుం ది. ఇంగ్లండ్ స్టార్ ఫార్వర్డ్ బుకాయో సాకా హ్యాట్రిక్ గోల్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ ఆరంభం నుంచే ఇంగ్లాండ్ దూకుడుగా ఆడింది.
మూడో ని మిషంలోనే డెక్లాన్ రైస్ గోల్ చేయగా, 18వ నిమిషంలో ఎజ్రి కొన్సా మరో గోల్ చేయడంతో ఇంగ్లాండ్ 2 ఆధిక్యంలో నిలి చింది. ఫస్టాఫ్ ముగియడానికి కొన్ని నిమిషాల ముందు సాకా వరుసగా రెండు గోల్స్ కొట్టి ఆధిక్యాన్ని 4 పెంచేశాడు. అయి తే సెకండాఫ్‌లో ఫ్రాన్స్ పుంజుకుంది. 48వ నిమిషంలో ఎంబాపె గోల్ చేయగా,54వ నిమిషంలో బ్రాడ్లీ మరో గోల్ సాధించాడు. 87వ నిమిషంలో సాకా గోల్ కొట్టగా, ఎక్స్‌ట్రా టైంలో ఫ్రాన్స్ గోల్ చేసినా ఇం గ్లాండ్ స్కోరును అందుకోలేకపోయింది. చివరి నిమిషంలో ఇంగ్లండ్ స్టార్ జూడ్ బెల్లింగ్‌హామ్ గోల్ చేసి 6 విజయాన్ని అందించాడు.1966లో టైటిల్ గెలిచిన తర్వాత ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన.






