3 April, 2026 | 3:29 AM

పేదల జీవితాల్లో మార్పు ప్రజా ప్రభుత్వ లక్ష్యం

03-04-2026 12:00 AM

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికతో అభివృద్ధి వేగవంతం 

రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క 

ములుగు (మహబూబాబాద్)/వెంకటాపూర్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): పేదల జీవితాల్లో మార్పు తేవడం కోసం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ద్వారా అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలులో భాగంగా గురువారం ములుగు జిల్లా వెంకటాపూర్, గోవిం దరావుపేట మండలం చల్వాయి, ములుగు పట్టణంలో నిర్వహించిన గ్రామ సభలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తీసుకురావడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, స్థానిక చట్టసభలే గ్రామ సభలని, గ్రామ సభ తీర్మానం ద్వారానే ప్రభుత్వ పథకాలు అమలు చేయడం, సమస్యలను పరిష్కరించుకుంటూ గ్రామాలను అభివృద్ధి పథంలో దూసుకుపోవడానికి గ్రామ సభలు దోహదపడతాయని మంత్రి సీతక్క తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్రామాలలో సమస్యలను పరిష్కరించడానికి, గ్రామ అభివృద్ధి కోసం 99 రోజుల ప్రణాళిక ప్రగతిని కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.

గ్రామ పంచాయతీలలో నూతన పాలకవర్గం ఏర్పడిన తరు వాత గ్రామాలలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, జరగాల్సిన కార్యక్రమాలకు, ప్రభు త్వ సంక్షేమ పథకాలు వాటి అమలు, ప్రజలకు కావాల్సిన ప్రయోజనాలు, తలెత్తిన స మస్యల పరిష్కారానికి గ్రామ సభల ద్వారా ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకొని తీర్మానాల ద్వారా గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు పోతాయని పేర్కొన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అం దుతాయని, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని అర్హులైన వారు గ్రామసభల ద్వారా మళ్లీ దరఖాస్తు సమర్పించ వచ్చని స్పష్టం చేశారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 48 గంటలలోనే మహాలక్ష్మి పథకం ద్వారా మహి ళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అమలు చేయడం జరిగిందని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 5 లక్షల నుంచి 10 లక్షల పెంపొందించడం జరిగిందని, పేదవారు కడుపునిండా భోజనం చేయాలనే ఉద్దేశం తో సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని, మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ వ్యాపార రంగాలలో స్థిరమైన ఆర్థిక సాధించే విధంగా ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల రెండవ విడతలో స్థానిక సర్పంచ్, అధికారుల ఆధ్వర్యంలో అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని సూచించారు. 

ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రెటరీ అనిత రామచంద్రన్, కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, అదనపు కలెక్టర్ సంపత్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, రాష్ట్ర పంచాయతీ రాజ్ డైరెక్టర్ భగవాన్ రెడ్డి, డి ఆర్ డి ఓ శ్రీనివాస్, డి పి ఓ వెంకయ్య, మున్సిపల్ చైర్మన్ చింత నిప్పుల చంద్రకళ, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించే మహిళా సమాఖ్య భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. తాడ్వాయి మండలానికి చెందిన 21 మంది, వెంకటాపురం మండలానికి చెందిన 31 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు.