8 August, 2026 | 4:50 AM

శిశువుకు తల్లిపాలే శ్రేష్ఠం

08-08-2026 01:27 AM

మహేశ్వరం ప్రభుత్వ జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ నాగేందర్ 

ఎల్బీనగర్, ఆగస్టు 7: శిశువులకు తల్లిపాలు శ్రేష్టమని, ప్రతి తల్లి శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని మహేశ్వరం ప్రభుత్వ జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ నాగేందర్ సూచించారు. వనస్థలిపురంలోని మహేశ్వరం ప్రభుత్వ జనరల్ దవాఖానలో శుక్రవారం తల్లిపాల వారోత్సవాలు ముగింపు వారోత్సవాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పీడియాట్రిక్స్ విభాగాధిపతి డాక్టర్ అనిత ఆధ్వర్యంలో నర్సింగ్ విద్యార్థులు తల్లిపాల ప్రాముఖ్యతను చాటిచెప్పే సందేశాత్మక నాటిక)తోపాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. తల్లిపాలతో శిశువులు, తల్లులకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.