30 May, 2026 | 9:10 PM

Breaking News

సత్యనారాయణపురం గ్రామంలో భూ సమస్యలపై సమావేశం   •   పంచాయతీ కార్యదర్శిపై చేయి చేసుకున్న సీనియర్ అసిస్టెంట్   •   ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ హల్‌చల్   •   కమనీయం.. రమనీయంగా వనదుర్గమ్మ పల్లకి సేవ   •   చెరువులో పడి మృతి చెందిన శంకర్ మృతదేహం వెలికి తీత   •   జూన్ 3న వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయు జిల్లా మహాసభను విజయవంతం చేయాలి   •   ప్రభుత్వ జూనియర్ కళాశాల కోసం విద్యార్థుల ఎదురుచూపులు   •   వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం   •   అక్రమ నిర్మాణదారులపై క్రిమినల్ కేసులే   •   కార్మికుల పక్షాన నిలిచే ఏకైక శక్తి, కార్మికులకు అండ, సీఐటీయూ   •  

పాము కాటుతో బాలుడు మృతి

30-05-2026 08:12 PM

బిజినేపల్లి: మండలంలోని సల్కర్ పేట గ్రామానికి చెందిన మేకల చరణ్ (11) అనే బాలుడు శుక్రవారం రాత్రి పాము కాటుకు గురై శనివారం ఉదయం మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మేకల చరణ్ అనే బాలుడు శుక్రవారం రాత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి ఆరు బయట నిద్రిస్తున్నాడు. మధ్యరాత్రి కట్ల పాము బాలుడిని కాటేసి అక్కడే ఉండి పోయింది. విషయం గమనించిన తల్లి తండ్రులు ఉదయం నాగరుకర్నూల్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కోసం తరలించారు. బాలుడి పరిస్థితి అప్పటికే విషమించడంతో మరణించాడు. తల్లితండ్రులు అంజనమ్మ బంగారయ్యలకు చరణ్ ఏకైక కుమారుడు. చరణ్ కు ఇద్దరు అక్కలు ఉన్నారు.