28 July, 2026 | 2:01 AM

సింగవరం-1కు అంగన్వాడీ భవనం మంజూరు చేయాలి

28-07-2026 01:04 AM

అలంపూర్, జూలై 27: సింగవరం-1 గ్రామానికి నూతన అంగన్వాడి కేంద్ర భవనం, స్వయం సహాయక సంఘాల సమాఖ్య భవనం మంజూరు చేయాలని గ్రామ సర్పంచ్ గొంగల్ల ఈశ్వర్ సోమవారం అడిషనల్ కలెక్టర్ నర్సింగ్రావుకు వినతిపత్రం అందజేశారు. అలాగే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు తాగునీటి సౌకర్యం, కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేసి గ్రామ సమస్యలను పరిష్కరించాలని కోరారు.