7 August, 2026 | 4:52 PM

Breaking News

గణపురం జడ్పీహెచ్‌ఎస్‌లో ముందస్తు బోనాల సంబరాలు   •   క్విట్ ఇండియా స్ఫూర్తితో జైలు భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి   •   వానాకాలం పంటలకు పోచారం ప్రాజెక్టు నీటి విడుదల   •   అచ్చంపేటలో ప్రజాస్వామ్య హక్కులు దెబ్బతింటున్నాయి   •   విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్   •   బీజేపీ కిసాన్ మోర్చా నూతన మండల అధ్యక్షులకు నియామక పత్రాల అందజేత   •   అన్నపూర్ణ పంప్ హౌస్ లు ఆన్ చేయాలి: సిద్ధం వేణు   •   గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   ఆరేళ్ల నిరీక్షణకు తెర.. మళ్లీ విద్యుత్ ఉత్పత్తికి శ్రీశైలం 4వ యూనిట్   •   అర్బన్ రెసిడెన్షియల్ తనిఖీ చేసిన అదనపు కలెక్టర్   •  

చెరువులో పడి బాలుడు మృతి.!

06-08-2026 04:13 PM

స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని ఆరోపణ

రామచంద్రపురం: స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంతో ఆరేళ్ల  బాలుడు చెరువులో పడి మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలో గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీకారం వండర్ నెస్ట్ ప్లే స్కూల్‌లో ఒకటో తరగతి చదువుతున్న షణ్ముఖ్ (6) స్కూల్ సమీపంలోని చెరువులో పడి మృతి చెందాడు. ఈ ఘటన స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే జరిగిందని స్థానిక కాలనీవాసులు ఆరోపించారు.

బాలుడు స్కూల్ నుండి బయటకు వెళ్లడం యాజమాన్యం గమనించలేదని తెలిసింది. బాలుడి మృతితో తల్లిదండ్రులు ఉదయ్ కుమార్, మనీష తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న కొల్లూరు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. బాలుడి మృతికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.