24 August, 2026 | 4:27 AM

చెరువులో పడి బాలుడి మృతి

24-08-2026 01:53 AM

సదాశివపేట, ఆగస్టు 23: సదాశివపేట మండలం ఎంకెపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన టేకూరి చంద్రశేఖర్ కుమారుడు మహాతేజ్ (2 సంవత్సరాల 8 నెలలు) శనివారం సాయంత్రం చెరువులో పడి మృతి చెందాడు. సాయంత్రం 5 గంటల సమయంలో బాలుడు కనిపించకపోవడంతో తల్లి ఫోన్ ద్వారా తండ్రికి సమాచారం ఇచ్చింది.

వెంటనే ఇంటికి చేరుకున్న చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు, స్థానికుల సహాయంతో గాలించగా చెరువులో బాలుడి ఆచూకీ లభించింది. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఇంటి వెనకాలే ఉన్న మురికి కాలువ కూడా దాటలేని వయస్సులో ఉన్న రెండున్నరేళ్ళ బాలుడు చెరువు వరకు వెళ్లి అందులో ఎలా పడిపోయాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

చిన్నారి స్వయంగా అంత దూరం వెళ్లి చెరువులో పడిపోయాడా లేక ఘటనకు మరేదైనా కారణం ఉందా? అనే సందేహాలు కుటుంబ సభ్యుల్లో నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బాలుడి మృతిపై అనుమానం ఉందంటూ తండ్రి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించామని ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని సదాశివపేట పోలీసులు తెలిపారు.