12 June, 2026 | 2:31 AM

బూత్ లెవెల్ ఏజెంట్‌లే పార్టీకి వెన్నుముక

12-06-2026 01:25 AM

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

సూర్యాపేట, జూన్ 11 (విజయక్రాంతి): సర్ పేరుతో ఓటర్ల హక్కులను హరించవద్దని ఎం ఎల్ సి బల్మూరి వెంకట్, సీనియర్ నాయకులు కత్తి వెంకటస్వామిలు అన్నారు. గురువారం పట్టణంలోని బాలాజీ కన్వెన్షన్ హల్‌లో బూత్ లెవల్ ఏజెంట్ల కు ప్రత్యేక శిక్ష ణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్ వలన పేద లు, కార్మికులు, గ్రామీణ ప్రాంత ప్రజలు అ వసరమైన పత్రాలు సమర్పించడంలో ఇ బ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్నా రు.

అయితే వారి ఓటు హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌కు ఉందన్నా రు. ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రా థమిక హక్కు అని, అంతటి గొప్ప ఆయుధాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ హరించరాన్నా రు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగించే చర్యలు అంగీకరించబోమని, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున ఉద్యమిస్తుందని హెచ్చరించారు. ప్రతి గ్రామం, ప్రతి వార్డులో కాంగ్రెస్ పార్టీ సర్ ప్రక్రియను పర్యవేక్షిస్తుందని. ప్రజలకు అవసరమైన సహాయం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.