9 August, 2026 | 12:42 PM

కేంద్రం మొండి వైఖరికి వ్యతిరేకంగా జెన్ జీ ఉద్యమం

09-08-2026 11:37 AM

ప్రజాస్వామ్యంలో ఎంతటి వారైనా తల వంచక తప్పదు

హైదరాబాద్: స్వాతంత్ర ఉద్యమంలో క్విట్ ఇండియాది(Quit India Movement) కీలక పాత్రని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ (Bomma Mahesh Kumar Goud) అన్నారు. కేంద్రం మొండి వైఖరి వ్యతిరేకంగా జెన్ జీ ఉద్యమం మొదలైందని పేర్కొన్నారు. జెన్ జీ ఉద్యమ వీరులు క్విట్ ఇండియా ఉద్యమం గురించి తెలుసుకోవాలని సూచించారు.

మహాత్మా గాంధీ, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూను మరిపించే ప్రయత్నం జరుగుతోందని మహేశ్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగానికి తూట్లు పొడిచే వారికి క్విట్ చెప్పాల్సిన అవసరం ఉందని మహేశ్ గౌడ్ తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎంతటి వారైనా తల వంచక తప్పదని హెచ్చరించారు. సర్ ప్రక్రియలో ఓట్లు తొలగింపు జరుగుతోందని ఆరోపించారు. ఓట్ల తొలగింపు అడ్డుకొని అర్హత కలిగిన ఓటును కాపాడుతున్నామని సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కుల వివక్ష లేకుండా పోరాటం చేస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.