అమరవీరులకు నివాళులర్పించిన ఆదివాసులు
09-08-2026 12:27 PM
ఉట్నూర్, ఆగస్టు 9(విజయక్రాంతి): ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా మండలంలోని ఆదివాసి గ్రామాల పటేళ్లు, జిల్లాలోని వివిధ రాయి సెంటర్ల సార్ మేడిలు ఇంద్రవెల్లి అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం ఆదివాసి గూడాలలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం వేడుకలను జరుపుకున్న అనంతరం ఇంద్రవెల్లి గిరిజన అమరవీరుల స్మారక స్థూపాన్ని వద్దకు చేరుకొని ఘనంగా నివాళులర్పించిన అనంతరం ఆదివాసి దినోత్సవాన్ని అమరవీరుల స్థూపం వద్ద జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి కేస్లాపూర్ రాయి సెంటర్ సార్ మేడి మెస్రం వెంకట్రావు నాయకత్వంలో నిర్వహించారు.






