శివాలయంలో శాకంబరి రూపంలో దర్శనమిస్తున్న అమ్మవారు
09-08-2026 11:59 AM
ఎర్రుపాలెం ఆగస్టు 9 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని శివాలయంలో అమ్మవారు శాఖంబరి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆషాడ మాసం సందర్భంగా ఆదివారం నాడు బాల త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయంలో అమ్మవారు శాకంబరి అమ్మ వారి గ భక్తులకు దర్శనం కల్పిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు నూరి గోపాలకృష్ణ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారిని దర్శించి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు . తదనంతరం శివాలయం చైర్మన్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు జమలాపురం కమలాకర్ బాబు, దూదిగం శ్రీనివాసరావు, శివాలయ చైర్మన్ దంపతులు మగినం జయశ్రీ, వీరభద్ర రావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.






