12 June, 2026 | 3:44 AM

సేవచేసే ప్రతి ఉద్యోగి అవార్డుకు అర్హుడే..

12-06-2026 01:27 AM

ఎస్‌ఈ ఏ శ్రీనివాసులు

కోదాడ, జాన్ 11 : ప్రజలకు సేవచేసే ఉద్యోగి నాదెళ్ల బాలకృష్ణ శ్రమశక్తి అవార్డుకు అర్హుడు అని సూర్యాపేట జిల్లా ఎస్‌ఈ ఏ శ్రీనివాసులు , హుజుర్ నగర్ డివిజన్ డిఈ ఎన్ వెంకటకృష్ణయ్య లు అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని అప్పయ్య ఫంక్షన్ హాల్ లో హుజూర్ నగర్ డివిజన్ 1104 యూనియన్ ఆధ్వర్యంలో శ్రమశక్తి అవార్డు గ్రహీత నాదెళ్ల బాలకృష్ణ కి ఆత్మీయ అభినందన సభ ర్వహించారు.

ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ బాలకృష్ణ ఉద్యోగరీత్య పేద మధ్య తరగతి ప్రజలకు ఇబ్బంది లేకుండా వారి సమస్యలను ఉద్యోగరీత్యా తీర్చుకుంటూ సమాజంలో ఎంతో కొంత సేవ చేయాలనే సంకల్పంతో  సత్యమేవ జయతే సేవాసమితిని ఏర్పాటుచేసి ఎంతోమందికి ఆసరాగా నిలిచారని గుర్తు చేశారు. విద్యుత్ కార్మికులకు ఏదైనా సమస్య వచ్చిందంటే అండగా ఉంటూ వారికి ధైర్యాన్ని చెప్పుకుంటూ ఎంతోమందికి బాసటగా నిలిచారని గుర్తు చేశారు.

విద్యుత్ కార్మికులు నాదెళ్ల బాలకృష్ణ కు ఈ అవార్డు రావడం హుజూర్ నగర్ డివిజనకే గర్వకారణమని అన్నారు. విద్యుత్ శాఖలో రైతులకు, పేద ప్రజల పక్షాన నిరంతరం శ్రమ చేస్తున్న నాదెళ్ల బాలకృష్ణకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మేడే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం చేత శ్రమశక్తి అవార్డు ఇవ్వడం ఎంతో ఆనందించదగిన విషయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నేతగాని వెంకాన, జిల్లా కార్యదర్శి పి యాదగిరినాయుడు, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల సత్యనారాయణ,ఇతర డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు, ప్రముక వైద్యులు జాస్తి సుబ్బారావు, ఏ రామారావు, విద్యా వేత్తలు జానకిరామయ్య, హుజూర్ నగర్ డివిజన్  అధ్యక్ష కార్యదర్శులు కుతుంబాక భాస్కర్, వీరేపల్లి మధుసూదనరావు పాల్గొన్నారు.