బీఎల్ఓలు ఫారాలు తీసుకోవడం లేదు: అసదుద్దీన్ ఒవైసీ
హైదరాబాద్: ఆగస్టు 9, 10 తేదీలలో ప్రభుత్వ సెలవు(Government holiday) దినాల కారణంగా బూత్ స్థాయి అధికారులు (BLOలు) గణన (ఎన్యుమరేషన్) ఫారమ్‌లను స్వీకరించడానికి నిరాకరిస్తున్నారన్న ఫిర్యాదులపై భారత ఎన్నికల సంఘం (ECI), గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కమిషనర్ తక్షణమే దృష్టి సారించాలని AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆదివారం కోరారు. ECI, GHMC కమిషనర్ల అధికారిక ఖాతాలను ట్యాగ్ చేస్తూ, ఒవైసీ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని లేవనెత్తారు.
"9వ తేదీన (బోనాలు)(Lal Darwaza Ashada Bonalu) 10వ తేదీన (రంగం - ప్రభుత్వ సెలవు దినం) గణన (Enumeration) ఫారమ్‌లను స్వీకరించబోమని BLOలు తమకు స్పష్టంగా చెప్పారని, మా SIR గైడెన్స్ డెస్క్ వద్ద ప్రజల నుండి నిన్నటి నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయి" అని ఒవైసీ 'X' వేదికగా పేర్కొన్నారు. ఆ రెండు రోజుల్లో తమ దరఖాస్తులు స్వీకరించబడవని చెప్పినట్లుగా తెలియడంతో పలువురు ఆందోళనతో సహాయ కేంద్రం (guidance desk) వద్దకు వచ్చారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ప్రకారం, ప్రజలు తమ గణన (enumeration) ఫారమ్‌లను సమర్పించడానికి ఆగస్టు 10 వరకు సమయం ఉందని ఒవైసీ పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని, అలాగే నిర్ణీత గడువులోగా ప్రక్రియను పూర్తి చేసే అవకాశాన్ని అర్హులైన వారు కోల్పోకుండా చూడాలని ఆయన అధికారులను కోరారు. తెలంగాణలో ఓటర్ల జాబితాల సవరణ, ఓటర్ల వివరాల పరిశీలనకు సంబంధించి రాజకీయ పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ, 'SIR' ప్రక్రియపై రాజకీయ చర్చ జరుగుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు చేశారు.






