15 May, 2026 | 6:37 PM

గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన

15-05-2026 05:11 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో శుక్రవారం  గ్రంథాలయంలో విద్యా వారోత్సవాల్లో భాగంగా డీఈవో దర్శనం పూజలతో కలిసి పుస్తక పఠనంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయగా పాఠకుల నుంచి మంచి స్పందన వచ్చింది. గ్రంథాలయంలో అనేక పుస్తకాలను అందుబాటులో ఉంచడం వల్ల వాటిని చదువుకొని చాలామంది ఉద్యోగాలు సాధించాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారులు సిబ్బంది పాఠకులు పాల్గొన్నారు.