జిల్లాలో వేగంగా హౌస్ హోల్డింగ్ సర్వే
నిర్మల్,(విజయక్రాంతి): భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు 2027 జనగణలో భాగమైన హౌస్ హోల్డింగ్ సర్వే జిల్లాలో పారదర్శకంగా వేగంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. నిర్మల్ జిల్లాలో ఈనెల 11 నుంచి హౌస్ హోల్డింగ్ సర్వే ప్రారంభమైందని 1400 మంది రెమినేటర్లు ప్రతిరోజు ఇంటికి సంబంధించిన సర్వేలు చేస్తున్నారన్నారు. సర్వ సిబ్బందికి ప్రజలు వారు అడిగిన సమాధానం చెప్పాలని సూచించారు.
33 అంశాలకు సంబంధించిన ప్రశ్నలకు ఆన్లైన్ డేటాలో వివరాలు నమోదు చేయవలసి ఉంటుందని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాలో నిర్వహించిన స్వీయ గణన సర్వేలో 20000 డేటా నమోదు చేసుకున్నారని ఇది తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా మంచి ఫలితాన్ని ఇచ్చిందని గుర్తు చేశారు. ఎండల తీవ్రత సర్వే సిబ్బందికి ప్రత్యేక సూచనలు చేసినట్లు తెలిపారు.






