సిర్గాపూర్ పీహెచ్సీ వైద్య అధికారిణిపై చర్యలు
15-05-2026 06:03 PM
సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రమైన పీహెచ్సీ వైద్యాధికారిణి ప్రతిభపై చర్యలు తీసుకుంటూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వసంత్ రావ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వైద్యాధి కారిణి ప్రతిభ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఇటీవల స్థానికులు నారాయణ్ ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహా రతికి ఫిర్యాదు చేశారు. సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్యాధికారిణిపై ప్రత్యేక అధికారుల బృందం విచారణ జరిపి నివేదిక అందజేశారు. సబ్ కలెక్టర్ సూచన మేరకు వైద్యాధికారిణి ప్రతిభను డైరెక్టర్ వైద్యారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖకు సరెండర్ చేస్తూ డీహెచ్ ఉత్తర్వులిచ్చారు.






