15 May, 2026 | 7:07 PM

సర్ సర్వేకు సహకరించాలి

15-05-2026 05:53 PM

నిర్మల్,(విజయక్రాంతి): ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో నిర్వహించిన సమగ్ర ఓటర్ల  ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ( సర్) కు ప్రతి ఒక్కరు సహకరించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పిలుపునిచ్చారు. శుక్రవారం సర్ సర్వే ప్రాధాన్యతను వివరించారు. దేశంలో ఒకే ఓటు హక్కు కల్పించాలని ఉద్దేశంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. చనిపోయిన వారి పేర్లు తొలగించడం, వలస కార్మికుల వివరాలు సేకరించడం అర్హుల పేర్లను మాత్రమే జాబితాలో పొందుపరచడం, వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని దీనికి ప్రజలు ఓటర్లు రాజకీయ పార్టీలు సంపూర్ణ సహకారం అందించి సమగ్ర ఓటర్ల జాబితాకు సహకరించాలని పిలుపునిచ్చారు.