15 May, 2026 | 6:00 PM

మండల అధ్యక్షుడుని సన్మానించిన ఎమ్మెల్యే

15-05-2026 04:47 PM

బోయినపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల నూతన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్మనబోయిన సువీన్ యాదవ్ ను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. శాభాష్ పల్లికి చెందిన కాంగ్రెస్ నాయకులు, యువ న్యాయవాది కొమ్మనబోయిన సువీన్ యాదవును మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమకం చేస్తూ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ముదిగంటి సురేందర్ రెడ్డి, సింగల్ విండో  చైర్మన్ జోగినపల్లి వెంకట రామారావు, మండల కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.