అంతర్జాతీయ స్థాయికి ఎంపికైన ఆరేపల్లి శ్రీనికా
15-05-2026 05:57 PM
* అభినందించిన సర్పంచ్ రజిత రాజశేఖర్
పాపన్నపేట: మండల పరిధిలోని ఆరేపల్లి గ్రామానికి చెందిన వట్టిపల్లి సంతోష్ రావు-హిరీష దంపతుల కుమార్తె శ్రీనిక (జేఎంఐ) జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ సీజన్ 10 లో అంతర్జాతీయ స్థాయికి ఎంపికైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మే 9న కేరళలో నిర్వహించిన జాతీయ స్థాయి జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ లో వివిధ ప్రదర్శనలో నైపుణ్యం ప్రదర్శించి అంతర్జాతీయ స్థాయికి ఎంపికైనట్లు తెలిపారు. ఆగస్టు మాసంలో బ్యాంకాక్ లో అంతర్జాతీయ ప్రదర్శనలు ఉంటాయన్నారు. ఎయిట్ టు టెన్ క్యాటగిరిలో భారతదేశం నుండి ముగ్గురు ఎంపికయ్యారన్నారు. వారిలో ఒకరు శ్రీనిక ఎంపిక కావడం పట్ల ఆరేపల్లి సర్పంచ్ రజిత రాజశేఖర్ తో పాటు గ్రామస్తులు అభినందించారు.






