3 August, 2026 | 3:24 AM

బోనాలు తెలంగాణ సంస్కృతికి చిహ్నం

03-08-2026 01:58 AM

మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు 

మహేశ్వరం, ఆగస్టు 2, (విజయ క్రాంతి) : తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉందని మెదక్ పార్ల మెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. ఆదివారం ఆషాడ మా స బోనాల పండుగ సందర్భంగా ఆయన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరంలోని శ్రీశ్రీశ్రీ మహంకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారిని దర్శించుకున్నారు,

ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు ఘనస్వాగతం పలికి సత్కరించారు, ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆ అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు, ఈ కార్యక్రమంలో స్థానికులు మహేందర్ ముదిరాజ్ ఈశ్వర్, మల్లేష్, హరికృష్ణ, ఎట్టయ్యా, జంగయ్య, యాదయ్య, కుమార్, పరమేశ్, నరేష్, శ్రీను, కావలి జంగయ్య, మహేష్, శివరామకృష్ణ, జాతర నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.