ఎంజేపీలో బోనాల పండుగ వేడుకలు
04-08-2026 02:38 PM
బేల,(విజయక్రాంతి): ఎంజేపీ (బాయ్స్) రెసిడెన్షియల్ పాఠశాలలో బోనాల పండుగను విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది సంప్రదాయబద్ధంగా, భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ ఒళ్ళపవర్ భాగ్యలక్ష్మి, ప్రిన్సిపాల్ గణేష్ జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించారు. విద్యార్థినులు సంప్రదాయ దుస్తుల్లో బోనం తీసుకువచ్చి, సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ ఆకట్టుకున్నారు. పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణంతో కళకళలాడగా, బోనాల పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, అతిథులు, విద్యార్థులు పాల్గొన్నారు.






