3 August, 2026 | 2:57 AM

జహీరాబాద్‌లో ఘనంగా బోనాలు

03-08-2026 12:24 AM

జహీరాబాద్, ఆగస్టు 2: జహీరాబాద్ పట్టణంలో బోనాల పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాలలోని మహిళలు బోనాలను అంగరంగ వైభవంగా తయారు చేసుకొని కొత్త దుస్తులు ధరించి నెత్తిన బోనాల అలంకరణతో శివసత్తుల ఆటలతో బోనాలు సమర్పించుకున్నారు. ఇందులో పోతురాజుల విన్యాసాలు పలువురుని ఆశ్చర్యపరిచాయి. జహీరాబాద్ గడి మహిల ప్రాంతంలో 9 అమ్మవారి గుళ్ళు ఉండడంతో అక్కడికి జహీరాబాద్ ప్రాంతంలోని వివిధ వార్డుల్లోని మహిళలు వచ్చి బోనాలు సమర్పించుకున్నారు. ఆయా వార్డులలోని ప్రజాప్రతినిధులు మహిళలు బోనాలను తీసుకొని వచ్చి సమర్పించారు.

బోనాల పండుగలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జహీరాబాద్ పట్టణ ఎస్‌ఐ లవ కుమార్ పర్యవేక్షించారు. గడి ప్రాంతంలో గల ఊడరమ్మ అమ్మవారి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నరోత్తం దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా నరోత్తం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా అమ్మవారిని దర్శించుకుని జహీరాబాద్ ప్రాంతంలోని ప్రజలను సుఖశాంతులతో చూడాలని మొక్కుకున్నట్లు తెలిపారు. బోనాలు పండగలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు అధికారులు మహిళలు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.