3 August, 2026 | 1:44 PM

పి.సుదర్శన్ రెడ్డికి రెడ్ క్రాస్ సొసైటీ శుభాకాంక్షలు

03-08-2026 12:49 PM

బోధన్, ఆగస్టు 03 (విజయక్రాంతి): జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ(Red Cross Society) ఆధ్వర్యంలో బోధన్ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పి. ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి  సోమవారం ఉదయం ఆయనను కలిసి జన్మదిన సందర్భంగా ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బుస ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్, జిల్లా కోశాధికారి కరిపే రవీందర్‌లు సుదర్శన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా సేవలో ఆయన మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఆయురారోగ్యాలతో నిండి ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ రెడ్ క్రాస్ ప్రతినిధులు శుభాభినందనలు తెలిపారు.