3 August, 2026 | 1:35 PM

సీజేపీ ఆందోళనపై సుప్రీంకోర్టులో పిటిషన్

03-08-2026 12:08 PM

న్యూఢిల్లీ: కాక్రోచ్‌ జనతా పార్టీ (Cockroach Janata Party) ఆందోళనపై సుప్రీంకోర్టులో విశ్రాంత ఎయిర్ ఫోర్స్ అధికారి(Retired Air Force officer) పిటిషన్ వేశారు. సీజేపీ నిర్వాహకులు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. నిర్వాహకుల జవాబుదారీతనాన్ని పరిశీలించాలని పిటిషనర్ కోర్టును కోరారు. ప్రభుత్వం ఉదారంగా ఉన్నప్పటికీ.. సీజేపీ (CJP Protests) నిర్వాహకులు బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేశారని సూచించారు. సోషల్ మీడియాలో(social media) యువతీయువకులు దుర్భాషలాడుతూ వీడియోలు పెట్టారని పిటిషన్ వెల్లడించారు. దుర్భాషలాడిన యువతపై కేసు పెట్టకుండా సామాజిక సేవ చేయించాలని కోర్టును కోరారు. పిటిషన్ రేపు లేదా ఎల్లుండి విచారణ జాబితాలో చేర్చాలని సీజేఐ ధర్మాసనం(CJI's Bench) సూచించింది.