డ్రైనేజీ పనులను పరిశీలించిన సుడా చైర్మన్
03-08-2026 12:16 PM
ఖమ్మం నగర మున్సిపాలిటీ పరిధిలోని 58వ డివిజన్ నందు అధికారులతో కలిసి డ్రైనేజీ పనులను ఖమ్మం సుడా చైర్మన్ పువాళ్ల దుర్గాప్రసాద్ సోమవారం అకస్మీకంగా పరిశీలించారు. అక్కడ పనుల పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం లో ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్రగర్ల హనుమంతరావు, ఖమ్మం జిల్లా గ్రంధాలయం చైర్మన్ ఖాదర్ బాబా, వారితోపాటు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, శెట్టి రంగారావు, డివిజన్ కార్యకర్తలు పాల్గొన్నారు






