తెలంగాణలో జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్
24-08-2026 02:10 PM
- మద్యం అమ్మకాలపైనే ప్రభుత్వానికి ఎక్కువ శ్రద్ధా?
- మద్యం వ్యాపారానికి ఇంత తొందర ఎందుకు?
- ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడంలో మీన మేషాలు
- ఇదేనా రేవంత్ రెడ్డి ప్రజా పాలన?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జాబ్ నోటిఫికేషన్లు నిల్(Job Notifications Nil).. లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(Siddipet MLA Thanneeru Harish Rao) విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వేచిచూస్తున్నారని హరీశ్ రావు స్పష్టం చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలపై కాంగ్రెస్ మీన మేషాలు లెక్కిస్తోందని మండిపడ్డారు. 121 మద్యం బ్రాండ్ల నోటిఫికేషన్లు ఆఘమేఘాల మీద విడుదల చేస్తోందని సూచించారు. జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వని మీకు.. మద్యం వ్యాపారానికి మాత్రం తొందర ఎందుకు? ఉద్యోగాలు ఇవ్వడం కంటే.. మద్యం అమ్మకాలపైనే కాంగ్రెస్ ఎక్కువ శ్రద్ధా? ఇదేనా రేవంత్ రెడ్డి ప్రజా పాలన? అని హరీశ్ రావు ప్రశ్నించారు.






