ఘనంగా ఏఎస్ఐ పుట్టినరోజు వేడుకలు
కొడిమ్యాల,ఆగస్టు 24 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి, కొండగట్టులో ఏఎస్ఐ విధులు నిర్వహిస్తూ.. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న చిలుక శ్రీనివాస్ 61వ పుట్టినరోజు సందర్భంగా కొండగట్టులో శ్రీనివాసుల సేవా సంస్థ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీనివాసులు చిలుక శ్రీనివాస్ కు శాలువా కప్పి సన్మానించారు. తదుపరి కేకు బదులు ఖర్బూజా కట్ చేయగా, స్నేహితులు శ్రీనివాస్ కు తినిపించారు. శ్రీనివాస నిత్య కళ్యాణం చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసుల సేవా సంస్థ అధ్యక్షులు వూట్కూరి శ్రీనివాసరెడ్డి, కరీంనగర్,జగిత్యాల, కోరుట్ల,రాయికల్ పట్టణాల నుండి వచ్చిన సుమారు 35 మంది శ్రీనివాస మిత్రులు,కొడిమ్యాల ఐక్య సంఘం ప్రధాన కార్యదర్శి,ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొండూరి సురేష్, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు బల్ల అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.






