సారంపల్లి మల్లారెడ్డి మృతిపై సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి
హైదరాబాద్: రైతాంగ సమస్యలపై నిరంతరం పోరాడిన రైతు నాయకుడు, కమ్యూనిస్టు నేత సారంపల్లి మల్లారెడ్డి(Sarampally Malla Reddy Death) మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సారంపల్లి రైతుల హక్కులు, వ్యవసాయ సమస్యల పరిష్కారం కోసం ముందుండి అనేక ఉద్యమాలు నడిపించారని గుర్తుచేశారు. రైతు సంఘం నేతగా, అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడిగా సారంపల్లి అందించిన సేవలు చిరస్మరణీయమని సీఎం పేర్కొన్నారు.
భూమి హక్కులు(Land rights), సాగునీరు, వ్యవసాయ రుణాలు, విత్తనాలు వంటి వ్యవసాయ రంగానికి సంబంధించిన విస్తృత అంశాలపై నిరంతరం కృషి చేస్తూ జీవితాన్ని రైతుల సంక్షేమం కోసం అంకితం చేసిన నాయకుడు మల్లారెడ్డి అన్నారు. సారంపల్లి మల్లారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని రేవంత్ రెడ్డి ప్రార్థించారు. మల్లారెడ్డి కుటుంబ సభ్యులు, అభిమానులకు ముఖ్యమంత్రి సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.






