28 June, 2026 | 5:08 PM

పీవీ నరసింహారావుకు ఘన నివాళి

28-06-2026 03:48 PM

నిర్మల్,(విజయక్రాంతి): భారత మాజీ ప్రధానమంత్రి భారతరత్న పి.వి. నరసింహారావు 105వ జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు , ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు బొజ్జు పటేల్, నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కూచాడి శ్రీహరిరావు, నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ పాల్గొని జిల్లా కేంద్రం లో శాంతినగర్ చౌరస్తా లోని పి.వి. నరసింహారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. దేశ ఆర్థికాభివృద్ధికి, పరిపాలనలో ఆయన అందించిన విశిష్ట సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.