రక్తంతో తడిసిన బ్యాగులు.. బూట్లు
12-04-2026 01:07 AM
- విమానసీట్లలో ఉంచి సందేశం
ఇస్లామాబాద్ బయలుదేరేముందు ఇరాన్ స్పీకర్ ఘాలిబఫ్ నిరసన
టెహ్రాన్, ఏప్రిల్ 11: ఇరాన్ మినాబ్‌లోని ఓ పాఠశాలపై అమెరికా పాల్పడిన దాడికి నిరసనగా, చిన్నారుల మృతికి నివాళిగా ఇరా న్ నుంచి ఇస్లామాబాద్‌కు బయలుదేరిన ఓ విమానానికి ‘మినాబ్ 168’ అని పేరు పెట్టా రు. ఈ విమానంలో పార్లమెంట్ స్పీకర్ ఘాలిబఫ్ ఇరాన్ నుంచి బయలుదేరేముం దు మృతి చెందిన చిన్నారుల ఫోటోల ను, రక్తంతో తడిసిన వారి బ్యాగులు, బూట్లను, పుష్పాలను ఉంచి నివాళులర్పించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
విమానంలో నా సహచరులు ‘మినాబ్168’అని పేర్కొన్నాడు. ఫిబ్రవరి 28న ఐఆర్జీసీ స్థావరాలపై అమెరికా దాడులకు దిగింది. ఈ నేపథ్యంలో తో మహాక్ అనే క్షిపణి పాఠశాలను ఢీకొట్టింది. ఈ దాడిలో 168మంది చిన్నారులు, 14 మంది ఉపాధ్యాయులు మృతిచెందారు.




