12 April, 2026 | 3:00 AM

ఆర్టెమిస్, విజయవంతం

12-04-2026 01:09 AM
  1. సురక్షితంగా భూమికి చేరుకున్న వ్యోమగాములు

తదుపరి మా టార్గెట్ అంగారకుడు : ట్రంప్

వాషింగ్టన్, ఏప్రిల్ 11: భూమి నుంచి అత్యంత దూరం ప్రయాణించిన మానవసహిత అంతరిక్ష యాత్ర ఆర్టెమిస్ విజయ వంత మైంది. శనివారం ఉదయం వ్యోమగాములు ప్రయాణించిన ఆర్టెమిస్ తిరిగి భూ మికి చేరుకుంది. కాలిఫోర్ని యా సమీపంలోని పసిఫిక్ మహాసముద్రం శాన్ డి యాగో తీరంలో వ్యోమగాములు ఒరాయన్ క్యాప్సుల్‌లో మూడు భారీ పారాచూట్ల సా యంతో క్షేమంగా ల్యాండై చరిత్ర సృష్టించారు.

నాసా వ్యోమగాములకు స్వా గతం పలుకుతూ ఎక్స్‌లో పోస్టు చేసింది. వ్యోమగాములకు స్వాగతం, సురక్షితంగా భూమిని చేరుకున్నారు. దీంతో చరిత్రాత్మక మిషన్ విజయవంతమైందని తెలిపింది. ఏప్రిల్ 1న అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఆర్టెమిస్ ను ప్రయోగించింది. ఇందులో వ్యోమగాములు రీడ్ వైస్ మాన్, విక్టర్ గ్లోవ ర్, క్రిస్టినా కోచ్, కెనడాకు చెందిన జెరెమీ హాన్సన్‌లు పాల్గొన్నారు.

ఇప్పటివరకు మానవులు వెళ్లలేని 4,06, 771 కిలోమీటర్ల దూరం వ్యోమ గాములు ప్రయాణించారు. దీంతో అపో లోఘూ రికార్డు కూడా బద్దలైంది. ఈ యా త్రలో చంద్రుని అవతలి వైపు సంపూర్ణ సూ ర్యగ్రహణం వంటి దృశ్యాలను కెమెరాల్లో బంధించారు. ఆర్టెమిస్ విజయవంతంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. వైట్‌హౌస్‌లో వ్యోమగాములను కలుసుకునేందుకు ఎదురుచూస్తున్నానని, తదుపరి అడుగు అంగారక గ్రహం అని ట్రంప్ ట్వీట్ చేశారు.