నెల రోజులు ఇంటింటి సర్వే...
23-06-2026 07:41 PM
ఉట్నూర్,(విజయక్రాంతి): ఖానాపూర్ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో ఈ నెల 25 నుంచి జులై 24 వరకు బీఎల్ వోలు సర్ సర్వేను ఉట్నూర్ ఆర్డీవో రాథోడ్ మోహన్ సింగ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ... జులై 31న ముసాయిదా జాబితా ప్రదర్శన ఉంటుందన్నారు. జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఓటర్ల ఫిర్యాదులు, అభ్యంతరాల స్వీకరణ సందేహాలున్న ఓటర్లకు నోటీసుల జారీ, వారి గుర్తింపు కార్డుల పరిశీలన ప్రక్రియలను చేపడతామన్నారు. అక్టోబరు 1న ఓటర్ల తుది జాబితాను ప్రదర్శిస్తామని ఆర్డిఓ తెలిపారు. బీఎల్వోల ఇంటింటి సర్వే కు సంబంధించిన మెట్రోలను నియోజకవర్గంలోని ఆయా మండలాల తహసిల్దారులకు మంగళవారం పంపిణీ చేశారు.






