23 June, 2026 | 9:56 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

యూరియాను సక్రమంగా సరఫరా చేయండి

23-06-2026 08:51 PM

- రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు

బోధన్,(విజయక్రాంతి): రెంజల్ మండల్ తాసిల్దార్ కు మంగళవారం రోజున వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పుట్టి నడిపి నాగన్న గుమ్మల గంగాధర్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు పార్వతి రాజేశ్వర్ మాట్లాడుతూ... విత్తనాల ఎంపిక ఎరువుల సరఫరా పంటలు వాటి సమస్యల రైతులు దృవంగ ఇబ్బందులు పెడుతున్నాయి.

 రాష్ట్ర ప్రభుత్వం రైతంగానికి ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం వల్ల సమస్యలు మరింత తీవ్రతరం అవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల సమస్యలను గుర్తించి పరిష్కరించాలని కోరుతున్నాం రైతులకు అవసరమైన విత్తనాలు యూరియా డిఏపి కాంప్లెక్స్ ఎరువులను సహకారం లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని యూరియాను యాప్ ద్వారా బుక్ చేసుకునే విధంగా విధానం రైతులకు ఇబ్బందికరంగా మారింది. 

ఈ విధానాన్ని పతి రైతుకు అవసరమైన మేరకు యూరియా సరఫరా చేయాలి ఒక ఎకరాకు కనీసం నాలుగు బస్తాలు ఏరియా అవసరం ఉన్నందున ఆ మేరకు డి ఏ పి  ఇతర కాంప్లెక్స్ ఎరువులను కూడా తగినంతగా సరఫరా చేయాలి.  కాంప్లెక్స్ ఎరువుల ధరల పెరుగుదల వల్ల రైతుల పెట్టుబడి భారం పెరుగుతుంది. ధరలను నిరంతరించి రైతులకు అందుబాటు ధరల్లో ఎరువులను అందించాలి.

పంట పెట్టుబడి సహాయంగా ఇచ్చే రైతు సీజన్ చెల్లించాలని గత బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలి భూమి స్వభావం ప్రాంత పరిస్థితులను అనుగుణంగా రైతులు విత్తనాలను ఎంపిక చేసుకుంటారు.  ప్రభుత్వం కొన్ని రకాలు సన్న వారి పంటలు పండిస్తే కొనుగోలు చేస్తామని నిబంధనలు పెట్టడం సరికాదు రైతులు పండించిన ప్రతి రకం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలిపై సమస్యలన్నిటిని ప్రభుత్వం అత్యవసరంగా పరిశీలించి పరిష్కరించాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం తరఫున కోరుతున్నాం.