ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి
- ఏబీవీపీ బెజ్జుర్ మండల ఇంచార్జ్ విశ్వంత్ గౌడ్
బెజ్జూర్,(విజయక్రాంతి): అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ బెజ్జురు మండలం శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్ లో భాగంగా బెజ్జురు లోని అన్ని పాఠశాలలు బంద్ చేయడం జరిగింది.ఈ సందర్బంగా ఏబీవీపీ నాయకుడు విశ్వంత్ గౌడ్ మాట్లాడుతూ... రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వం కొలువుదీరిన కొత్తలోనే ప్రజాప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం విద్యా అని ప్రకటించిన విషయం మనందరికీ విదితమే. కానీ స్వయంగా ముఖ్యమంత్రి రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలలు మౌలిక వసతులు లేక నిర్వీర్యం అయిపోతున్నాయి.
మొక్కుబడి కార్యక్రమాలు,ప్రభుత్వ సవతి తల్లి ప్రేమ కారణంగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతుంటే, ప్రైవేట్ విద్యాసంస్థల్లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజుల దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని వారు కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో ఏబీవీపీ నాయకులు . కంబాల అన్వేష్, గార్లపల్లి చరణ్, కేశెట్టి కౌశిక్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.






