23 June, 2026 | 9:44 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే బర్తరఫ్ చేయాలి

23-06-2026 08:26 PM

డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కేంద్రం

రాహుల్ గాంధీ చేపట్టిన విద్యార్థుల గొంతుక ఛాత్రోంకి గుజ్ కార్యక్రమానికి జిల్లా పార్టీ తరపున మద్దతు

తుంగతుర్తి,(విజయక్రాంతి): నీట్‌ పేపర్‌ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెంటనే  ప్రధాని మోడీ బర్తరఫ్ చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య డిమాండ్‌ చేశారు. మంగళవారం  మండల కేంద్రంలోని మాజీమంత్రి ఆర్డీఆర్ నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.

దేశంలో ఉన్న ప్రతి వేయి మందిలో కేవలం 12 మందికే  ఉద్యోగాలు వస్తున్నాయని, రెండు కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు లేకపోవుగా పేపర్ లీకేజ్ ల పేర్లతో విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందని విమర్శించారు. పోటీ పరీక్షల్లో పేపర్ లీకేజీల వల్ల మా భవిష్యత్తు ఆగమవుతుందని స్నేహ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమన్నారు. దీంతో చలించిపోయిన రాహుల్ గాంధీ విద్యార్థుల పక్షాన విద్యార్థుల గొంతుకగా చేపట్టిన ఛాత్రోంకి గుజ్ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరపున మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు.