15 June, 2026 | 2:11 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా..

11-12-2025 12:00 AM

సంస్థాన్ సర్పంచ్ అభ్యర్థి అంతటి భాగ్యలక్ష్మి

సంస్థాన్ నారాయణపూర్ , డిసెంబర్ 10 (విజయక్రాంతి): సంస్థాన్ నారాయణపురం గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తాను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తనను ఆదరించి ఆశీర్వదిస్తే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని అంతటి భాగ్యలక్ష్మి అన్నారు. స్థానికంగా నివాసం ఉంటూ మహిళలను చైతన్య పరుస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి కృషిచేసిన మహిళగా అందరిలో గుర్తింపు తనకు అదనపు బలం అన్నారు.

మహిళలంతా తన వెంట నడుస్తూ స్వచ్ఛందంగా ప్రచారంలో పాల్గొనడం తనపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. గ్రామంలో బస్టాండు నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి సమస్య పరిష్కారం, యువతకు జిమ్ ఏర్పాటు, మండల కేంద్రానికి వచ్చే ప్రజల కోసం మరుగుదొడ్ల నిర్మాణం,యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తానని తెలిపారు. కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని నారాయణపూర్ గ్రామస్తులను అభ్యర్థించారు.