29 July, 2026 | 4:14 PM

బీజేవైఎం లడాయి పోస్టర్లు విడుదల

29-07-2026 03:28 PM

నిర్మల్,(విజయక్రాంతి): ఫీజుల బకాయి – బీజేపీ లడాయి కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా యువ మోర్చా (BJYM) ఆధ్వర్యంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షులు దొడ్డికింది నిరంజన్ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీ రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడడం మానుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో BJYM జిల్లా అధ్యక్షుడు దొడ్డికింది నిరంజన్ రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, బీజేపీ సీనియర్ నాయకులు సాదం అరవింద్, జంగం వీరేష్ , జమాల్, జుట్టు దినేష్,ఇర్ల విజయ్, శ్రీకాంత్ రెడ్డి,కందుల హరీష్, భరత్   కౌన్సిలర్లు  రాజు, నరేష్, శశాంక్  బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.