29 July, 2026 | 4:47 PM

వైభవంగా గోపూజోత్సవం గురు పౌర్ణమి ఉత్సవం

29-07-2026 04:02 PM

ముకరంపుర,(విజయక్రాంతి): స్థానిక కృష్ణానగర్ లోని శ్రీ ధర్మశాస్త్ర సేవా ట్రస్ట్  ఆధ్వర్యంలో గురుపౌర్ణమి వ్యాసపౌర్ణమి ని పురస్కరించుకొని 108 మంది దంపతుల చేత సామూహిక గో పూజోత్సవాన్ని గురుపూజోత్సవాన్ని నిర్వహించారు. మయూరగిరి పీఠాధీశులు  పండితులు నమిలకొండ రమణాచార్య స్వామి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు గోపూజ వైభవం నిర్వహించారు. వ్యాసభగవానుడు లోకానికి 18 పురాణాలు, ఉప పురాణాలు, ఉపనిషత్తులు అందించి గురు స్థానాన్ని పొందాడని, ప్రతి వ్యక్తికి తల్లి మొదటి గురువు అని, గోమాత తల్లి  క్షేమాన్ని అందిస్తుంది కాబట్టే దానిని గోమాత అన్నారని, గోమాతను ఆరాధించిన వారికి తల్లిదండ్రుల సేవ చేసిన వారికి సకల దేవత అనుగ్రహం కలుగుతుందని రమణా చార్యులు తెలియ పరచారు.