29 July, 2026 | 4:46 PM

రాగి తీగలు చోరీ.. స్క్రాప్ దుకాణం యజమాని అరెస్ట్

29-07-2026 03:52 PM

బైంసా జూలై 29 (విజయక్రాంతి): మైనర్లతో రాగి తీగల చోరిని ప్రోత్సహిస్తున్న స్క్రాప్ దుకాణ యజమానిని భైంసా పోలీసులుఅరెస్టు చేశారు. బైంసా పట్టణ ఇన్చార్జి సీఐ ప్రవీణ్ కుమార్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయం ఎదురుగా ఉన్న స్క్రాప్ దుకాణం యజమాని షేక్ నజీర్ మైనర్లతో రాగి తీగలను చోరీకి ప్రోత్సహిస్తున్నారు.

అందులో భాగంగా పట్టణ శివాజీ చౌరస్తాలోని నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో రాగి తీగలు ఇటీవల చోరీకి గురయ్యాయి. బాధితులు ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజ్ లను పరిశీలించగా స్క్రాప్ యజమాని మైనర్లతో ఈ చోరీకి ప్రోత్సహించి తగనంతరం ఆ వైర్లను కొనుగోలు చేసి స్క్రాప్ గా మార్చి  సొమ్ము చేసుకుంటున్నాడు. సిసి ఫుటేజ్ ఆధారంగా స్క్రాప్ యజమాని అరెస్టు చేసి రిమాండ్ పంపినట్టు తెలిపారు. అలాగే చోరీకి పాల్పడిన మహిళలను అదుపులోకి తీసుకొని విచారించినట్లు రాగి తీగలను స్వాధీనపరుచుకున్నామని పేర్కొన్నారు.