29 July, 2026 | 4:47 PM

శ్రీ సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం

29-07-2026 03:55 PM

"అన్ని దానాల కంటే అన్నదానం మిన్న" అనే భారతీయ సనాతన సంప్రదాయాన్ని చాటుతూ, 

గురు పౌర్ణమి సందర్భంగా పాత పాల్వంచ శ్రీ సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం...

రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు వనమా రాఘవేంద్రరావు ,వనమా బేబీ సరోజినీ దంపతులు

పాల్వంచ,(విజయక్రాంతి): అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అన్నారు బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేందర్రావు. గురు పౌర్ణమి సందర్భంగా పాత పాల్వంచ లోని సాయిబాబా దేవాలయంలో 46వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ ముత్యాల ప్రవీణ్ కుమార్ – శ్రీలత దంపతులతో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

ఈ సందర్భంగా  మాట్లాడుతూ, "అన్ని దానాల కంటే అన్నదానం మిన్న. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం మహా పుణ్యకార్యం. గురువుల ఆశీస్సులు ప్రతి ఇంటా సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాం" అన్నారు. పాత పాల్వంచ ప్రజలందరికీ, ముఖ్యంగా  ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆలయ కమిటీ ముత్యాల కోటేశ్వరరావు  వారి బృందం వారికీ శుభాకాంక్షలు తెలియజేసారు ఈ కార్యక్రమంలో ముత్యాల వీరభద్రం ,ముత్యాల రమణ మూర్తి ,47వ డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ మిరియాల అలివేలు, బట్టు మంజుల  , ఏనుగుల శ్రీను తదితరులు పాల్గొన్నారు