6 April, 2026 | 9:47 PM

న్యాయవాదులకు ఎల్లప్పుడూ సహకారం అందిస్తా

06-04-2026 07:49 PM

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంజీవ ముదిరాజ్

ముఖ్యమంత్రి చొరవతో న్యాయవాదులకు రక్షణ చట్టం బిల్లు ఆమోదం

మహబూబ్ నగర్ టౌన్: న్యాయవాదులకు కాంగ్రెస్ పార్టీ తరఫున తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందించడం జరుగుతుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పేర్కొన్నారు. సోమవారం ఆయన న్యాయవాదుల సంఘం కార్యాలయానికి విచ్చేశారు. ఇటీవల ఎన్నికల్లో గెలిచిన నూతన అధ్యక్ష కార్యదర్శులతో పాటు ఇతర కార్యవర్గాన్ని శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో ఉన్నతమైనటువంటి న్యాయవాద వృత్తి లో ఉంటూ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తూ నిలవడం ఎంతో గొప్ప విషయం అని ఆయన పేర్కొన్నారు.

1989లో తాను న్యాయవాదిగా పేరును నమోదు చేసుకున్నానని అన్నారు. కొన్ని అనివార్య కారణాలవల్ల ఒత్తి లోకి రాలేకపోయానని అయినప్పటికీ ఆ న్యాయవాద చదువ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పారు. న్యాయవాదుల పాదయాత్ర ఫలితంతో న్యాయవాదుల రక్షణ చట్టం బిల్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రత్యేక చొరవ తీసుకొని ఆమోదింప చేశారని చెప్పారు. హామీని రాష్ట్ర ముఖ్యమంత్రి నిలబెట్టుకోవడం జరిగిందని పేర్కొన్నారు. నూతనంగా ఎన్నుకోబడ్డ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఆనందరావుకు ప్రధాన కార్యదర్శి నరసింహ రెడ్డి, ఉపాధ్యక్షుడు వెంకటయ్యలతో పాటు మిగతా కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు అనంతరం మాట్లాడుతూ సంఘం కార్యాలయానికి మా తోటి సహచర న్యాయవాదిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు జిల్లా అధ్యక్షుడి హోదాలో కాంగ్రెస్ పార్టీ పక్షాన రావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.అలాగే వారి సహాయ సహకారాలు కూడా ఎప్పుడు న్యాయవాదులకు ఉండేలా చూడాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డితో కలిసి సంఘం అధ్యక్షుడు ఆనందరావు ప్రధాన కార్యదర్శి నరసింహరెడ్డి సంయుక్త కార్యదర్శి సబితా కోశాధికారి రాజు గ్రంధాలయ కార్యదర్శి ప్రభావతి కార్యవర్గ సభ్యులు కృష్ణవంశీ మహేష్ కుమార్ విష్ణు వేద వంశీకృష్ణ మురళీమోహన్ మమత ఝాన్సీలను శాలువాలుతో సన్మానించారు.

అనంతరం న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఆనందరావు కార్యక్రమానికి హాజరైనటువంటి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ కార్పొరేటర్ ప్రవీణ్ కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్,కాంగ్రెస్ నాయకుడు మిథున్ రెడ్డి, డిస్ట్రిక్ట్ క్లబ్ ఉపాధ్యక్షుడు సీమ నరేందర్, సభ్యుడు సతీష్ తోపాటు మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు గోనెల శ్రీనివాస్ లనుసన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు చంద్రమౌళి  పటు తదితరులు పాల్గొన్నారు.