9 June, 2026 | 2:45 AM

హైదరాబాద్ రేవంత్‌రెడ్డి జాగీరా

09-06-2026 01:48 AM

బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్  

హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): హైదరాబాద్ రేవంత్‌రెడ్డి జాగీరా అని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మాటలు వింటుంటే సీఎంగా కిషన్‌రెడ్డి ఉన్నట్లుగా అనిపిస్తోందని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుచేయకుండా మోసం చేసిందని, రాష్ట్రంలో ప్రధాన పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి కేవలం సన్న వడ్లకే అర కొర చెల్లించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.

ఈ నెల 15 తర్వాత కిషన్‌రెడ్డి తెలంగాణాకు ఎలా వస్తారో చూస్తానని సీఎం మాట్లాడారని, ఒక సీఎంగా ఆయన ఇలా మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి 50 సార్లు ఢిల్లీకి వెళ్ళి వచ్చారని, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహకరించకుండానే రేవంత్ వెళ్లి వచ్చారా అన్నారు. ఆయన కూడా ఢిల్లీకి ఎలా వస్తావని అడ్డుకుంటే ఎలా ఉంటుందన్నారు.