ఇంద్రకరణ్ నూతన గృహప్రవేశానికి హాజరైన బీజేపీ నేతలు
బోధన్, ఆగస్టు 26(విజయ క్రాంతి): ఎడపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఇంద్రకరణ్ నూతన గృహప్రవేశ కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి (ఎంఆర్‌పీ) హాజరై ఇంద్రకరణ్ కుటుంబ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు నూతన గృహంలో కుటుంబ సభ్యులతో కొంత సమయం గడిపి, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు, ఎడపల్లి సర్పంచ్ కందకట్ల రాంచందర్, శ్రీధర్‌తో పాటు వివిధ మండలాల అధ్యక్షులు పసులోటి గోపీకిషన్, సిర్ప సుదర్శన్, సరిన్, యోగేష్ పాల్గొన్నారు. అలాగే మాజీ మండల అధ్యక్షులు ప్రవీణ్, మల్లెపూల శ్రీనివాస్, సాయినాథ్, ఆనంద్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఇంద్రకరణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.






