26 August, 2026 | 5:06 PM

ఓటర్ల జాబితాపై గ్రామ సభ.. తహశీల్దార్ రామ్మోహన్ రావు

26-08-2026 04:38 PM

బెజ్జూర్ ఆగస్టు 26 ( విజయ క్రాంతి): బెజ్జూర్ మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ (సర్ ) గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నట్లు తహశీల్దార్ రామ్మోహన్ రావు తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో గ్రామ సభ లేదా వార్డు సభలను నిర్వహించాలని అన్ని పోలింగ్ కేంద్రాల బిఎల్ వో  /ఎన్నికల అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు.

ఉదయం 11గంటలకు. సభ ముఖ్య ఉద్దేశాలు (ఎజెండా): 

ఓటర్ల పేర్ల చదువుట: డ్రాఫ్ట్ (ప్రాథమిక) ఓటర్ల జాబితాలో ఉన్న పేర్లన్నింటినీ బూత్ స్థాయి అధికారి ( బి ఎల్ ఓ ) బిగ్గరగా చదివి వినిపిస్తారు. తప్పిపోయిన పేర్ల గుర్తింపు, ప్రాథమిక జాబితాలో పేర్లు విడిపోయిన అర్హులైన భారతీయ పౌరులను గుర్తిస్తారు. కొత్త ఓటర్ల నమోదు, 2026 అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండే యువతీ యువకులు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఫారం-6 సమర్పించవచ్చు అని తెలిపారు. తప్పుల సవరణలు: ఓటర్ల జాబితాలో ఏవైనా తప్పులు లేదా వ్యత్యాసాలు ఉంటే వాటిని సరిచేయడానికి ఫారం-8 సమర్పించాల్సి ఉంటుంది. 

ఆక్షేపణలు:

అర్హత లేని లేదా ఒకే పేరు రెండు చోట్ల ఉన్న ఓటర్ల పేర్లను తొలగించడానికి ఫారం-7 ద్వారా ఆక్షేపణలు తెలియజేయవచ్చు. మీరు చేయవలసినవి 2026 ఆగస్టు 27న మీ ప్రాంతంలోని పోలింగ్ కేంద్రంలో జరిగే గ్రామ సభ లేదా వార్డు సభకు హాజరుకావచ్చు నని బి ఎల్ ఓ  చదివే ప్రాథమిక జాబితాలో మీ పేరు సరిగ్గా ఉందో లేదో సరిచూసుకోండి. కొత్త నమోదు, సవరణలు లేదా తొలగింపుల కోసం సంబంధిత ఫారాలను అక్కడే తీసుకోవాలని తహసీల్దార్ రామ్మోహన్ రావు తెలిపారు.