24-02-2026 01:17:09 AM
జగిత్యాల జిల్లాలో బీజేపీ క్రాస్ ఓటింగ్
బీజేపీ మద్దతుతో మెట్‌పల్లి మున్సిపల్ కాంగ్రెస్ కైవసం
బీజేపీకి మెజారిటీ స్థానాలు ఉన్న మెట్‌పల్లి, రాయికల్‌లో చైర్మన్ మిస్
చర్యలకు సిద్ధం అవుతున్న అధిష్టానం
మెట్‌పల్లి, ఫిబ్రవరి 23(విజయక్రాంతి): జగిత్యాల జిల్లాలోని మెట్ పల్లి, కోరుట్ల పరిధిలో ఏళ్లుగా భారతీయ జనత పార్టీకి మంచి ఓటు బ్యాంక్ కలిగి ఉంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన కోరుట్ల నియోజకవర్గం తో పాటు జిల్లాలో కూడ బీజేపీ తన సత్తా చాటుతూ వస్తోంది. ఇక ఫిబ్రవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోను బీజేపీ తన ఓటు శాతాన్ని ఘననీయంగా పెంచుకుంది.
జగిత్యాల జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి, ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీ లు ఉన్నాయి.తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జగిత్యాల మున్సిపల్ లో మొత్తం యాభై స్థానాలకు గాను కాంగ్రెస్ 23,బీజేపీ 06,బిఆరెస్ 04,యంఐయం 02 గెలువగా స్వతంత్రులు 15 స్థానాలలో గెలుపొందారు. అలాగే కోరుట్ల మున్సిపల్ లో మొత్తం 33స్థానాలకు గాను కాంగ్రెస్ 18,బిఆరెస్ 08,బీజేపీ 06,స్వతంత్రులు ఒక్కరు గెలుపొందారు.
ధర్మపురి మున్సిపల్ లో పదిహేను స్థానాలకు గాను పదిహేను కౌన్సిలర్ స్థానాలను కాంగ్రెస్ కైవశం చేసుకొని చరిత్ర నెలకొల్పింది. ఇక మెట్ పల్లి మున్సిపల్ లో మొత్తం 26స్థానాలకు బీజేపీ పది స్థానాలు గెలవగా కాంగ్రెస్ 06, బిఆరెస్ 06, స్వతంత్రులు నలుగురు గెలిచారు. అలాగే రాయికల్ మున్సిపల్ 12స్థానాలకు బీజేపీ 05,కాంగ్రెస్ 03,బిఆరెస్ 03,ఒకరు స్వతంత్రులు గెలిచారు.
మెట్‌పల్లి, రాయికల్‌లో అతి పెద్ద పార్టీగా బీజేపీ
మున్సిపల్ ఎన్నికల్లో మెట్ పల్లి, రాయికల్ మండలాలలో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించి బీజేపీ శ్రేణుల్లో ఆశలు రేపింది.కాని రాయికల్ ఇంచార్జి గా ఉన్న బిఆరెస్ నేత,ఎమ్మెల్సీ రమణ పక్క వ్యూహంతో ముందుకు సాగి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, మాజీ మంత్రి జీవన్ రెడ్డితో చర్చలు జరిపి తన సన్నిహితుడు బిఆరెస్ కాన్సిలర్ ను చైర్మన్ గా కటకం రవి గెలిపించుకోవడంతో బీజేపీ శ్రేణులు నిరాశ లో మునిగిపోయాయి.
మెట్ పల్లి మున్సిపల్ లో అతి పెద్ద పార్టీగా ఆవిర్బవించిన బీజేపీ అధికార పీఠం తమదే అంటూ ముందుకు సాగింది. కాని బీజేపీ పార్టీలో చైర్మన్ ఎంపిక కొలిక్కి రాకపోవడం, పార్టీ అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీని చైర్మన్ పదవికి దూరం చేసింది.
కేంద్ర,రాష్ట్రాలలో ఉప్పు, నిప్పుల ఉండే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ సీనియర్ కాన్సిలర్ చెట్ల పెల్లి మీనా -సుకెందర్ మద్దతు తెలపడం కాంగ్రెస్ మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని కైవశం చేసుకోవడం తో బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా తీవ్ర నిరాశకు లోను అయింది.దింతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా పార్టీ చెట్ల పెల్లి మీనా -సుకెందర్ ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
మెట్ పల్లిలో బీజేపీ జిల్లా అధ్యక్షుని ఇంటిపై దాడి
మెట్ పల్లి మున్సిపల్ లో మున్సిపల్ 26 స్థానాలకు 10 స్థానాలు బీజేపీ గెలిచిన మున్సిపల్ చైర్మన్ స్థానం దక్కించుకోవడంలో జిల్లా అధ్యక్షులు డా.యాదగిరి బాబు వైఫల్యమే కారణమని గెలిచినా కొందరు కాన్సిలర్ లు కార్యకర్తలు జిల్లా అధ్యక్షుని ఇంటిపై దాడి చేసి ఫార్నిచర్ ధ్వంసం చేశారు. అలాగే జిల్లా అధ్యక్షునిపై దాడికి దిగడంతో కొందరు పోలీస్ లకు సమాచారం ఇవ్వడం తో వారు పరిస్థితి ని అదుపులోకి తెచ్చారు. జిల్లా అధ్యక్షుని కుమారుని పిర్యాద్ మేరకు దాడి చేసిన వారిపై పోలీస్ లు కేస్ నమోద్ చేశారు.
కాని రెండు రోజుల క్రితం గెలిచిన బీజేపీ కౌన్సిలర్ లు అందరు మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ చెజారి పోవడానికి ఎంపి అరవింద్, జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు, స్థానిక బీజేపీ సీనియర్ నాయకుల నిర్లక్ష్యం కారణమని బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దింతో రాష్ట్ర వ్యాప్తంగా గెలిచే మెజారిటీ మున్సిపల్ చేజరడంపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం సీరియస్ గా దృష్టి సారించినట్లు తెలిసింది.
అలాగే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గంలో ఉన్న బీజేపీ సీనియర్ కోవర్ట్ లు సుకెందర్ లాగా పార్టీ విడాలని ఎంపి అరవింద్ అనడం జగిత్యాల జిల్లాలో తీవ్ర సంచలానానికి కారణం కాగా పార్టీ కోసం ఎలాంటి లాభపేక్ష లేకుండా పని చేస్తున్న కొందరు సీనియర్ కార్యకర్తలు తీవ్ర మనస్థాపానికి గురి అయ్యారు.ఇక మెట్ పల్లి లో మున్సిపల్ చైర్మన్ పోవడానికి తాము కారణం కాదని ఎంపి అరవింద్ చర్యలు కారణమని పార్టీ సస్పెండ్ చేసిన చెట్ల పెల్లి మీనా -సుకెందర్ లు ఆరోపించడం కొస మెరుపు.