calender_icon.png 19 February, 2026 | 10:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ అనైతికంగా గెలిచింది

19-02-2026 01:02:41 AM

మున్సిపల్ ఎన్నికల్లో బోగస్ ఓట్లుపై విచారణ జరిపించాలి

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన బీజేపీ

మంచిర్యాల, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికలలో బోగస్ ఓట్లతో పలువురు అభ్యర్థులు విజయం సాధించారనీ, వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బిజెపి మంచిర్యాల జిల్లా నాయకులు బుధవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూ రి వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ మంచిర్యాల కార్పొరేషన్ 52వ డివిజన్‌లో బోగస్ ఓట్లు పోలవడంపై 52వ డివిజన్ బీజేపీ అభ్యర్థి కోటగిరి స్వాతి రవి కుమార్ తో కలిసి ఫిర్యాదు చేశామన్నారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అనైతికంగా గెలిచిందన్నారు.

మంచిర్యాల కార్పొరేషన్ 52వ డివిజన్ జన్మభూమి నగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ జిల్లా అధ్యక్షులు ఒడ్డే రాజమౌళి ఇంటి నంబర్ (4-128)పై మందమర్రి మున్సిపాలిటీ నుంచి దాదాపు 130 బోగస్ ఓట్లను నమోదు చేయించి పోలింగ్ రోజున వారితో ఇక్కడ ఓట్లు వేయించాడని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. అదే విధంగా ఇంటి నంబర్ 4-59, 4 101 పై దాదాపు 50 ఓట్లకు పైగా లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల నుంచి గ్రామ పంచాయతీ ఓటర్లను ఇక్కడ నమోదు చేసుకోని మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని కాంగ్రెస్ అభ్యర్థి అనైతికంగా గెలిచారన్నారు.

ఈ విషయం పై విచారణ జరిపించి బోగస్ ఓట్లతో గెలిచిన 52 డివిజన్ కార్పొరేటర్ స్రవంతి కిషోర్ ఎన్నిక రద్దు చేయాలని కోరామన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో మంచిర్యాల మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్, కోటగిరి రవి కుమార్, మాజీ ఎంపీపీ బేర సత్య నారాయ ణ, నల్ల రవికుమార్ తదితరులున్నారు.

బోగస్ ఓటుతో మున్సిపల్ చైర్మన్ పదవి: మాజీ ఎమ్మెల్యే కోనప్ప 

కాగజ్‌నగర్ (విజయక్రాంతి):కాగజ్ నగర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కలిసి బోగస్ ఓటు ద్వారా చైర్మన్ పదవిని కాజేశాయని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆరో పించారు. బుధవారం తన నివాసంలో మా ట్లాడుతూ ఎమ్మెల్సీ దండే విఠల్ కాగజ్‌నగర్లో ఓటు హక్కు లేకపోయినా, కేవలం మున్సిపల్ ఎన్నికల్లో అక్రమ మార్గంలో చైర్మన్ పదవిని దక్కించుకోవాలనే ఉద్దేశంతో అధికారులతో కుమ్మక్కై మున్సిపల్ ఓటర్ జాబితాలో తన పేరు నమోదు చేసుకున్నారని ఆరోపించారు.

ఈ వ్యవహారంపై ఆధారాలతో ఉన్నతాధికారులు, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినప్ప టికీ ఇప్పటివరకు స్పందన లేదన్నారు. కాం గ్రెస్, బీజేపీ లోపాయకారి ఒప్పందం ద్వారా ఆ పదవిని చేజిక్కించుకున్నాయని ఆరోపించారు. బీజేపీ సిద్ధాంతాలకు విరుద్ధంగా కాం గ్రెస్‌తో అంతర్గత ఒప్పందం చేసుకుని ఎమ్మె ల్యే అమ్ముడుపోయారని ఆరోపించారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.