19-02-2026 01:04:27 AM
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో క్రమశిక్షణతో సరికొత్త పాలన
హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
కుమ్రంభీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి18 (విజయక్రాంతి): కుమ్రంభీం ఆసిఫాబాద్ కలెక్టర్ కె.హరిత పరిపాలన పారదర్శకత, క్రమశి క్షణ, బాధ్యతాయుత నిర్ణయాలకు ప్రతీకగా నిలుస్తోంది. గతంలో జిల్లాలో విధులు నిర్వహించిన కలెక్టర్ల పాలనకు దీటుగా ఆమె వ్యవ హరిస్తున్నారు. జిల్లా పరిపాలనకు కొత్త దిశను నిర్దేశిస్తున్నారు. గత అధికారుల పాలనలో కొన్ని సందర్భాల్లో జిల్లా అపప్రతిష్టకు లోనైనా, ప్రస్తుత కలెక్టర్ తీసుకుంటున్న చర్యలతో ప్రజల్లో విశ్వాసం పెరుగుతోంది.
జనవరి 19న బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కేవ లం నెల రోజుల వ్యవధిలోనే 92 కార్యక్రమా ల్లో పాల్గొనడం విశేషం. మంత్రుల పర్యటన లు, ఎన్నికల విధులు, సమీక్షలు, గ్రామాల సం దర్శనలు వంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పాలనా యంత్రాంగంపై తన పట్టును చాటారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయం సాధిస్తూ మంత్రుల పర్యటనల ను విజయవంతం చేయడం ఆమె పరిపాలనా సామర్థ్యానికి నిదర్శనంగా నిలిచింది.
ఆకస్మిక తనిఖీలతో క్రమశిక్షణ
సమీకృత కలెక్టరేట్లోని అన్ని కార్యాలయాలను ఆకస్మికంగా సందర్శిస్తూ, ప్రత్యక్ష తనిఖీల తో అధికార యంత్రాంగాన్ని గాడిలో పెడుతున్నారు. పదవీ బాధ్యతలు చేపట్టిన 15 రోజు ల్లోనే కలెక్టరేట్ కార్యాలయాలను మూడుసా ర్లు తనిఖీ చేసి, విద్యుత్ దుర్వినియోగం, బినా మీ చేత పనులు చేపించడం వంటి అవకతవకలను గుర్తించి సంబంధిత అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. గతంలో ఎవరూ చేయని విధంగా అన్ని శాఖల పనితీరును పరిశీలిస్తూ, ప్రభుత్వ పథకాలు అర్హులకు సకాలం లో చేరేలా తనిఖీలు చేపడుతున్నారు.
విధుల నిర్లక్ష్యంపై ప్రత్యేక దృష్టి
విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారుల పై రాజీ లేకుండా కఠినచర్యలు తీసుకుంటూ ‘బాధ్యతే ప్రమాణం’ అనే సందేశాన్ని బలంగా వినిపిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాలలో ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న వినోద విధుల్లో నిర్లక్ష్యం, అనుమతి లేకుండా గైర్హాజరు, విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయ డం వంటి ఆరోపణలు నిర్ధారణ కావడంతో సస్పెండ్ చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. దీంతో అధికార యంత్రాంగానికి స్పష్టమైన హెచ్చరికగా నిలిచింది.
వేగవంతమైన పరిష్కారాలు..
ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజాసమస్యలను నేరుగా విని, వేగవంతమైన నిర్ణయాల తో పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడం ఆమె పాలనలో కీలక అంశంగా మారింది. విద్య, వైద్యం, గిరిజన సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి రంగాల్లో అధికారు లతో సమన్వయం కొనసాగిస్తూ ఫలితాలకే ప్రాధాన్యమిస్తున్నారు. గ్రామాల సందర్శనలు, సమీక్షల ద్వారా ప్రభుత్వ పథకాల అమలుపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది.
అవినీతి రహిత పాలనపై ఆశలు
గతంలో జిల్లా స్థాయి అధికారులు ఏసీబీకి పట్టుబడ్డ ఘటనల నేపథ్యంలో కలెక్టర్ ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రభుత్వ వనరుల పరిరక్షణపై కట్టుదిట్టమైన వైఖరి ప్రదర్శిస్తూ, అవినీతి రహి త పాలన అందిస్తారనే నమ్మకాన్ని ప్రజల్లో బలపరిచారు. ఆమె వ్యవహార శైలిపై ప్రజలు విస్తృతంగా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అనుభవానికి తగ్గ పాలనపై దృష్టి
కలెక్టర్ హరిత గతంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖలో స్పెషల్ సెక్రటరీగా, జాయింట్ సెక్రటరీగా, కమర్షియల్ టాక్స్ డైరెక్టర్గా విజయవంతంగా విధులు నిర్వహించారు. ఆ అను భవమే ప్రస్తుతం జిల్లాలో పరిపాలనను చక్కదిద్దడంతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్ర మాలను సమర్థంగా ముందుకు తీసుకెళ్లేందుకు బలమైన పునాదిగా మారింది. క్రమశిక్షణతో కూడిన కఠిన నిర్ణయాలు, ప్రజాపక్షపాత పాలన, ప్రత్యక్ష పర్యవేక్షణతో జిల్లా పరిపాలనకు కొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్న కలెక్టర్ కె. హరిత, ‘మార్పు సాధ్యమే’ అన్న విశ్వాసాన్ని ప్రజల్లో నాటుతున్నారు.